ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫెడరేషన్‌ను నిర్వీర్యం చేయొద్దు

ABN, First Publish Date - 2021-10-28T06:13:36+05:30

సామాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకల పెంపకందారుల ఫెడరేషన్‌ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ విధంగా చేస్తే తమకు తీవ్రంగా నష్టం కలుగుతుందని ఏపీ గొర్రెలు, మేకలు పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ యర్రసాని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనలో పాల్గొన్న గొర్రెలు, మేకల పెంపకందార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఫెడరేషన్‌ను నిర్వీర్యం చేయొద్దు 

ఏపీ గొర్రెలు,మేకల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌  నాగేశ్వరరావు 

విజయవాడ సిటీ, అక్టోబరు 27: సామాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకల పెంపకందారుల ఫెడరేషన్‌ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ విధంగా చేస్తే తమకు తీవ్రంగా నష్టం కలుగుతుందని ఏపీ గొర్రెలు, మేకలు పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ యర్రసాని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న ఫెడరేషన్‌ను ఎత్తివేస్తే  దానిలోని కోట్లాది రూపాయలు నిర్వీర్యం అవుతాయన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార ఫెడరేషన్‌ను పరిరక్షించాలని కోరుతూ స్థానిక ధర్నాచౌక్‌లో బుధవారం గొర్రెలు, మేకలతో వాటి పెంపకందారులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో తమ అభివృద్ధికి ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.  రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత లాకా వెంగళరావు మాట్లాడుతూ ఫెడరేషన్‌ను మీట్‌ కార్పొరేషన్‌లో వీలినం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరైందికాదన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ, యువజన విభాగం అధ్యక్షుడు బోను దుర్గానరేష్‌, నగర అధ్యక్షుడు కలిశెట్టి లక్ష్మణరావు, ఏవీఎస్‌.రాజు, కృష్ణ, బారెల సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising