ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త సీపీ పాలరాజు?

ABN, First Publish Date - 2021-11-29T06:39:19+05:30

విజయవాడ నగర కొత్త పోలీసు కమిషనర్‌గా ఎవరు వస్తారనే సందిగ్ధతకు దాదాపు తెర పడినట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలోనే ఉత్తర్వులు


విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ నగర కొత్త పోలీసు కమిషనర్‌గా ఎవరు వస్తారనే సందిగ్ధతకు దాదాపు తెర పడినట్టు తెలుస్తోంది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సాంకేతిక విభాగానికి డీఐజీగా ఉన్న జి.పాలరాజును ఈ స్థానంలో నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాలరాజును నియమించాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో రెండు పర్యాయాలు ఇన్‌చార్జ్‌ పోలీస్‌ కమిషనర్‌గా వ్యవహరించిన పాలరాజుకు నగరంపై మంచి పట్టు ఉంది. గౌతమ్‌ సవాంగ్‌ విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో పాలరాజు ఇక్కడ పశ్చిమ జోన్‌ ఉపకమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నగర పోలీసు కమిషనర్‌గా డీజీపీ స్థాయి అధికారులు నియమితులయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిని ఐజీకి కుదించింది. తిరిగి ఈసారి డీఐజీ హోదా కలిగిన అధికారిని నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. అనంతపురం రేంజ్‌ డీఐజీ టి.కాంతిరాణా కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. అయితే ప్రభుత్వ పెద్దలు పాలరాజుకే ఓటు వేసినట్టు తెలుస్తోంది. బత్తిన శ్రీనివాసులు ఉద్యోగ విరమణ చేసిన వెంటనే పాలరాజును నియమిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఆయనకు ముందుగా కొద్దిరోజులపాటు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించి, ఆ తర్వాత పూర్తిస్థాయి కమిషనర్‌గా ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

Updated Date - 2021-11-29T06:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising