ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ గెలిస్తే పన్నుల బాదుడే

ABN, First Publish Date - 2021-03-09T06:45:20+05:30

‘మచిలీపట్నం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది..

పరాసుపేట సెంటర్‌లో జరిగిన సభలో లోకేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి పేర్ని నియోజకవర్గానికి చేసిందేమీ లేదు

మచిలీపట్నంలో నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారం


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ‘మచిలీపట్నం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మంత్రి పేర్ని నాని మాయమాటలు చెప్పడమే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు..’ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మచిలీపట్నంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు స్తంభాల సెంటర్‌ నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం కోనేరు సెంటర్‌ మీదుగా గిలకలదిండి, బందరు కోట, బుట్టాయిపేట, రామానాయుడుపేట, పరాసుపేట, చిలకలపూడి, జెడ్పీ సెంటరు, లక్ష్మీటాకీస్‌ సెంటర్‌, బైపాస్‌రోడ్డు, బలరామునిపేటల మీదుగా చింతచెట్టుసెంటర్‌ వరకు సాగింది. పరాసుపేట సెంటర్‌లో జరిగిన సభలో లోకేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్థానిక మంత్రి పేర్ని నాని పనితీరుపై విమర్శలు గుప్పించారు. మచిలీపట్నం పోర్టు ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నా, పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 


వెయ్యి ఇచ్చి.. రెండు వేలు లాగేస్తున్నారు 

సంక్షేమ కార్యక్రమాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి, రెండు వేలను గుంజుకుంటోందని లోకేశ్‌ ఆరోపించారు. అమ్మఒడి పేరుతో రూ.14వేలు ఇచ్చి నాన్న జేబునుంచి రూ.36 వేలు గుంజుకుంటున్నారని ప్రజలు చెప్పుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆటో యజమానికి 10 వేలు ఇచ్చి డ్రైవరు నుంచి వివిధ కారణాలు చూపి, రూ.25 వేలు వసూలు చేస్తున్నారని ఆటో డ్రైవర్లు చెప్పారని అన్నారు. 


చిటికేస్తే పనులు జరగాలి 

వైసీపీ అధికారం చేపట్టిన 20 నెలల వ్యవధిలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరిగిన దాఖలాలు లేవని లోకేశ్‌ అన్నారు. తాను, కొల్లు రవీంద్ర గతంలో మంత్రులుగా పనిచేశామని, చిటికేస్తే అభివృద్ధి పనులు జరిగేవన్నారు.  మచిలీపట్నంలో తాగునీటి ఎద్దడి నివారణకు టీడీపీ ప్రభుత్వం వందకోట్లతో ఏడు రిజర్వాయర్లను నిర్మించిందన్నారు. రవీంద్ర కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి, డ్రెయినేజీలు, రోడ్లను అభివృద్ధి చేయించారన్నారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బందరు బస్టాండ్‌ను అభివృద్ధి చేయలేక పోయారని, మచిలీపట్నంలో ఈ రెండేళ్ల వ్యవధిలో ఒక్క షాదీఖానా కట్టించలేదన్నారు. 


టీడీపీని గెలిపిస్తే శాశ్వత గృహాలు  

మచిలీపట్నం కార్పొరేషన్‌లో టీడీపీకి అధికారం అప్పగించి, మంత్రి పేర్నినాని గుండెల్లో రైళ్లు పరిగె త్తించాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. మంత్రిహోదాలో ఆకాశంలో విహరిస్తున్న పేర్ని నానీకి ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పి, నేలమీద నడిచేలా  చేయాలన్నారు. మచిలీపట్నంలో టీడీపీని గెలిపిస్తే పేదలకు జీ+3 గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారు.  


టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి 

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ టీడీపీ పాలనలోనే మచిలీపట్నం అభివృద్ధి చెందిందన్నారు. గిలకలదిండిలో మత్య్సకారులకు పొజిషన్‌ సర్టిఫికెట్లు గతంలోనే ఇప్పించామన్నారు. టీడీపీ పాలనలో ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బచ్చుల అర్జునుడు, మోటమర్రి బాబాప్రసాద్‌ల నేతృత్వంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మాజీ ఎంపీ  కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, బూరగడ్డ వేదవ్యాస్‌, కాగిత కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T06:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising