ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడకుదిటికి సుస్థిర స్థానం

ABN, First Publish Date - 2021-04-08T07:01:34+05:30

బలహీన వర్గాల ప్రజల్లో మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు చిరస్థాయిగా నిలిచి ఉంటారని టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు శివకోటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

బీసీ సెల్‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి నడకుదిటి సంతాప సభ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌  : బలహీన వర్గాల ప్రజల్లో మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు చిరస్థాయిగా నిలిచి ఉంటారని టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు శివకోటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో బీసీ సెల్‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి నడకుదిటి సంతాప సభ జరిగింది.   బీసీ సెల్‌ అధ్యక్షుడు శివకోటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో బీసీలకు సముచిత స్థానం లభించిందన్నారు. బొర్రా వెంకట స్వామి, నడకుదిటి నరసింహారావు, కొల్లు రవీంద్రలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని, అదే విధంగా కొనకళ్ల నారాయణరావుకు ఎంపీ టికెట్‌ ఇచ్చారన్నారు.  పలు అభివృద్ధి కార్యక్రమాలకు నడకుదిటి శ్రీకారం చుట్టారన్నారు.  కార్పొరేటర్‌ రాళ్లకొట్టు రాము, మత్స్యకారుల సంఘ నాయకుడు కొక్కిలిగడ్డ నాగరమేష్‌, మాజీ కౌన్సిలర్‌ కాసాని భాగ్యారావు,  తలారి రాంబాబు, అంగర తులసీదాస్‌, ఊకంటి రాంబాబు, తిరుమాని నారాయణ, మురాల ప్రసాద్‌ పాల్గొన్నారు.

రవీంద్రకు డి.వై.దాస్‌ పరామర్శ

మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు  అల్లుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కుటుంబ సభ్యులను పామర్రు మాజీ ఎమ్మెల్యే డి.వై.దాస్‌, మాజీ జడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్‌ తదితరులు బుధవారం పరామర్శించారు.  డి.వై దాస్‌ మాట్లాడుతూ, నడకుదిటి నరసింహారావు మృతి తీరని లోటన్నారు. కొల్లు రవీంద్ర, నీలిమలను పరామర్శించిన వారిలో మచిలీపట్నం రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు,  బీసీ సెల్‌ నాయకులు ఉన్నారు.

 

Updated Date - 2021-04-08T07:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising