ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం మాదే

ABN, First Publish Date - 2021-03-09T07:00:26+05:30

కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం మాదే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రామలింగేశ్వరనగర్‌, మార్చి 8 : విజయవాడ నగర కార్పొరేషన్‌పై తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయమని, గతంలో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చారిత్రాత్మక అవస రమని భావించామో, కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలు గుదేశం పార్టీ గెలటం కూడా అంతే అవసరమని ప్రజలు భావిస్తున్నారని ఎంపీ కేశినేని పేర్కొన్నారు. సోమవారం 9వ డివిజన్‌ అభ్యర్థిని చెన్నుపాటి కాంతిశ్రీ విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పటమటలంక రామా లయం నుంచి పలు ఏరియాల్లో విస్తృతంగా పర్యటించారు.  కేశినేని మాట్లాడుతూ 20 నెలల్లో జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ప్రజలకు ఉపాధి, ఆదాయం రెండు లేవని, నిత్యావసరాలు ఆకాశన్నంటాయని, సామాన్య ప్రజల స్ధితి దుర్భరంగా ఉందని, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కేశినేని నాని  కోరారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ పెంచలేదని, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మించామని, ఈ ప్రభుత్వం ముఖ్య మంత్రి సహాయనిధి ఎత్తివేసిందని, నగర పాలక సంస్థ లైట్లు వేయలేని పరిస్ధితిలో ఉందని, కార్పొరేషన్‌ దివాళా తీసిందని, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే విజయవాడ నగరం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, యలమం చిలి దేవేంద్ర, చెన్నుపాటి సురేష్‌, పాగోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T07:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising