ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణ మహోత్సవాలు

ABN, First Publish Date - 2021-12-08T06:28:34+05:30

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయడంతో షష్ఠి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో జి.వి.డి.ఎన్‌.లీలాకుమార్‌ తెలిపారు.

మోపిదేవి ఆలయాల్లో భక్తులకు ఏర్పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మోపిదేవి, సింగరాయిపాలెం ఆలయాల్లో భక్తులకు విస్తృత ఏర్పాట్లు

మోపిదేవి, డిసెంబరు 7 : మోపిదేవి  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయడంతో షష్ఠి  ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో జి.వి.డి.ఎన్‌.లీలాకుమార్‌ తెలిపారు.  ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.  ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ పర్యవేక్షకులు మధుసూదనరావు, చెన్నకేశవ తదితరులు ఉన్నారు.అవనిగడ్డ టౌన్‌ : సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దీక్ష  చేపట్టిన అవనిగడ్డ రెండో వార్డుకు చెందిన సోదరులు చెన్నగిరి భూపేష్‌, సుజిత్‌ పాలకావిళ్లతో పాదయాత్రగా మోపిదేవి వెళ్లి స్వామికి అభిషేకాలు, పూజలు చేశారు. 

సింగరాయిపాలెంలో..

ముదినేపల్లి రూరల్‌  : సింగరాయిపాలెం - చేవూరుపాలెం సెంటర్‌ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దంపతులు పుట్టలో పాలుపోసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. 13 రోజులు నిర్వహించే ఉత్సవాలకు  ఆలయాన్ని విద్యుద్దీపకాంతులతో ముస్తాబు చేశారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి వారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్సకు వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తులు మాస్క్‌ ధరించి స్వామి దర్శనానికి రావాలని అధికారులు ప్రత్యేక సూచనలు చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రస్ట్‌ బోర్డు పాలక మండలి భక్తులకు  ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది.  గుడివాడ ఆర్టీసీ డిపో నుంచి  ప్రతి అర గంటకు బస్సు సౌకర్యం కల్పించారు. 



Updated Date - 2021-12-08T06:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising