ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: అశోక్‌బాబు

ABN, First Publish Date - 2021-04-23T15:18:16+05:30

గత వారం రోజుల్లో ఐదుగురు సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గత వారం రోజుల్లో ఐదుగురు సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తాజాగా లేబర్ విభాగం ఎస్ఓ అజయ్ బాబు కరోనా సోకి మృతి చెందారని తెలిపారు. సీఎం జగన్ తాడెపల్లి ప్యాలెస్ నుంచి బయటకి రాకుండా ఉద్యోగులను మాత్రం విధులకు రావాలనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉద్యోగులు రోజుకొకరు పిట్టల మాదిరి రాలి పోతుంటే సీఎం జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. మృతి చెందిన ఉద్యోగులకు కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సీఎం కళ్లు తెరిచి సెక్రటేరియట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంకు అవకాశం కల్పించాలని అశోక్‌బాబు తెలిపారు. 

Updated Date - 2021-04-23T15:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising