ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3వేల పింఛన్ ఊసే లేదు: బాలవీరాంజనేయ స్వామి

ABN, First Publish Date - 2021-09-01T21:11:32+05:30

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా.. ఇంతవరకు రూ.3వేల పింఛన్ ఇవ్వలేదని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా.. ఇంతవరకు రూ.3వేల పింఛన్ ఇవ్వలేదని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా 25వేల సామాజిక పింఛన్లను తొలగించారని ఆరోపించారు. వైఎస్సార్ వర్ధంతిని సామాజికభద్రతా విద్రోహదినంగా జరుపుకోవాల్సిన దుస్థితికి తెచ్చారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రూ.2,250 పింఛన్‌ని, రూ.2,500 చేస్తానన్నారని.. వర్ధంతి వచ్చినా నెరవేర్చలేదని ఎద్దేవాచేశారు. దీనికితోడు ఒకనెల పింఛన్‌ను.. మరో నెలలో ఇవ్వమని చెప్పడం దుర్మార్గమన్నారు. ఒకే కార్డులో ఇద్దరి పేర్లు ఉంటే.. ఇద్దరి పింఛన్లనూ తొలగిస్తున్నారని.. అలాగే ఈకేవైసీ పేరుతో మరిన్ని పింఛన్లకు ఎసరుపెడుతున్నారని మండిపడ్డారు. ఆఖరకు దివ్యాంగులు, కిడ్నీ రోగులకు ఇవ్వాల్సిన పింఛన్లలోనూ కోతపెట్టారని దుయ్యబట్టారు. ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా.. పింఛన్ల చెల్లింపులో లబ్ధిదారులపై వలంటీర్లు జులుం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Updated Date - 2021-09-01T21:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising