ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక మంత్రి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: కొల్లురవీంద్ర

ABN, First Publish Date - 2021-03-06T16:26:28+05:30

రాష్ట్రానికి అప్పులు ఎక్కువ తీసుకువచ్చామని మంత్రే సిగ్గులేకుండా చెబుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి అప్పులు ఎక్కువ తీసుకువచ్చామని మంత్రే సిగ్గులేకుండా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టించడం ఎలాగో చంద్రబాబును చూసి నేర్చుకోండి అని హితవుపలికారు. సంపద ఎలా సృష్టించాలో చంద్రబాబుకు బాగా తెలుసని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేసి ఉంటే అమరావతి నుంచి సంపద వచ్చేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అహంకారంతో అమరావతిని నాశనం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును అటక ఎక్కించారని... ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. పథకాల పేరుతో వైసీపీ నేతలు రాష్ట్ర సంపదను దోచుకుంటూ ప్రజలకు కొంత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెడుతున్నారన్నారు. పాలన చేతకాకపోతే తప్పుకోవాలని.... రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-03-06T16:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising