ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Vellampalli పుట్టిన రోజుపై అనుమానం!

ABN, First Publish Date - 2021-08-15T19:46:13+05:30

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పుట్టిన రోజుపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పుట్టిన రోజుపై జనసేన పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. స్వాత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పుట్టిన తేదీపై అనేక సందేహాలు లేవనెత్తారు. ఇవాళ మంత్రి వెల్లంపల్లి పుట్టిన రోజు అని కొందరు చెబుతున్నారని అయితే.. ఆయన పుట్టినరోజు ఇవాళ కాదని మరికొందరు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారన్నారు. దీనిపై ఆ పార్టీ నేతలే అనేక సందేహాలు వెలిబుచ్చుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.


ఎందుకిలా..!?

నిజంగా ఆగస్టు 15వ తేదీనే వెల్లంపల్లి జన్మించిన రోజు అయితే అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేయాలి. 2009 వరకు తిధుల ప్రకారం పుట్టిన రోజు చేసుకునే వారని అంటున్నారు. 2010 తర్వాతే ఆగస్టు 15న పుట్టినరోజు వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారో మంత్రి సమాధానం చెప్పాలి. వైసీపీ నేతలు, కార్యకర్తల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మంత్రిపైనే ఉంది. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఆయన పుట్టిన తేదీని మంత్రి ప్రస్తావించకపోవడం పలు అనుమానాలను కలిగిస్తుంది. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బాగా పని చేశారంటూ అధికారులకు పతకాలు ఇచ్చారు. మరి రాష్ట్రంలో అవినీతి మంత్రి పురస్కారం పేరుతో మంత్రి వెల్లంపల్లిని ఎందుకు సన్మానించలేదని సీఎం వైఎస్ జగన్‌ను అడుగుతున్నాం. వెయ్యి కోట్లు దోచుకుని అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన వెల్లంపల్లికి పతకం ఇస్తే అందరూ సంతోషించే వారుఅని పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన నేత వ్యాఖ్యలపై మంత్రి, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2021-08-15T19:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising