ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదక ద్రవ్యాలను నిరోధించండి

ABN, First Publish Date - 2021-03-24T06:38:55+05:30

మహమ్మారిగా మారిన మాదక ద్రవ్యాలను నిరోధించి యువత బంగారు భవిష్యత్‌ను పరిరక్షించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. మాదక ద్రవ్య వ్యతిరేక ప్రచార ర్యాలీని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ మంగళవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బందరులో ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ

మచిలీపట్నం టౌన్‌, మార్చి 23 : మహమ్మారిగా మారిన మాదక ద్రవ్యాలను నిరోధించి యువత బంగారు భవిష్యత్‌ను పరిరక్షించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. మాదక ద్రవ్య వ్యతిరేక ప్రచార ర్యాలీని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ  మంగళవారం ప్రారంభించారు. లక్ష్మీటాకీసు సెంటర్‌ నుంచి జిల్లా కోర్టు సెంటర్‌ వరకు  ర్యాలీ జరిపి అనంతరం  జరిగిన బహిరంగ సభలో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను యువత నెరవేర్చాలని, ఇందుకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఏఎస్పీ మల్లికాగార్గ్‌, ఆర్డీవో ఖాజా వలి మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను  విద్యా సంస్థల్లో వివరించాలన్నారు. మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ మా ట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉత్తమ పౌరులుగా యువత ఎదగాలన్నారు.  డిప్యూటీ మేయర్‌లు టి. కవిత, లంకా సూరిబాబు, డా. సైదామరియం, దివ్యాంగుల శాఖ ఏడి నారాయణ, డీఎస్పీ రమేష్‌రెడ్డి, సీఐ అంకబాబు, జి. శ్రీనివాస్‌, ఎస్‌ఐలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-24T06:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising