ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూడిద రవాణాపై ఆందోళన

ABN, First Publish Date - 2021-08-04T05:58:51+05:30

బూడిద రవాణాపై ఆందోళన

ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లారీలు అడ్డుకున్న ఖిల్లా రోడ్డు నివాసితులు 

ఇళ్లపై బూడిద పడకుండా లారీలు నడపకపోతే నిలుపుదల చేస్తామని హెచ్చరిక 

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3: ఎన్టీటీపీఎస్‌ బూడిద చెరువు నుంచి నిత్యం వందలాది లారీల్లో బూడిద రవాణా చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఖిల్లారోడ్డు నివాసితులు బూడిద లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. నివాసాల మధ్య నుంచి వందలాది లారీలు బూడిదను తీసుకు వెళుతున్నాయని, దీంతో నివాసాలు బూడిదతో నిండిపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గు వస్తే నోటి వెంట రక్తం, బూడిద పడుతోందని వాపోతున్నారు. అనేక మార్లు ఎన్టీటీపీఎస్‌ అధికారులకు విన్నవించినా పట్టించుకో లేదన్నారు. బూడిద రవాణాకు టెండర్‌ వేసి దక్కించుకున్న కాంట్రాక్టర్‌, లోడింగ్‌ యంత్రాలు నడిపే బడా వ్యక్తులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. బూడిద పడకుండా రవాణా చేయకపోతే నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.



Updated Date - 2021-08-04T05:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising