ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెజవాడలో భారీ రన్‌వే!

ABN, First Publish Date - 2021-06-24T14:23:04+05:30

రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15న ప్రారంభించడానికి రంగం సిద్ధం

రాష్ట్రంలోనే అతి పెద్దదిగా గుర్తింపు 

డీజీసీఏ అనుమతులు మంజూరు 

భారీ అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌కు అవకాశం


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా విజయవాడ నిలవనుంది. బెజవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన నూతన రన్‌వే జూలై 15న అందుబాటులోకి రానుంది. నూతన రన్‌వే పొడవు 3,523 అడుగులు. ఇంతకుముందు వరకు దీని పొడవు 7,500 అడుగులుగా ఉండేది. కొత్తది అందుబాటులోకి వస్తే 11,023 అడుగులకు రన్‌వే పెరుగుతుంది. వాస్తవానికి రెండున్నరేళ్ల కిందటే ఈ రన్‌వే పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయ రైతుల భూ సమస్యలు తేలకపోవటం, చుట్టూ సెక్యూరిటీ లేకపోవటం వంటి కారణాలతో డీజీసీఏ అనుమతులు రాలేదు.


ఈ సమస్యలు ఇంకా తీరనప్పటికీ డీజీసీఏ ఏడాది కిందట వర్చువల్‌గా తనిఖీలు చేసింది. విజయవాడ విమానాశ్రయ అధికారులు నిర్వహించిన ఫ్రిక్షన్‌ టెస్ట్‌ కూడా విజయవంతంగా ముగిసింది. ఈ క్రమంలో పలుమార్లు వర్చువల్‌గా తనిఖీలు చేసిన డీజీసీఏ... జూలై 15నుంచి దీనిని వినియోగంలోకి తీసుకురావచ్చని నిర్దేశించింది. నూతన రన్‌వే అందుబాటులోకి రానుండటంతో భారీ అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండింగ్‌, టేకాఫ్‌ కావచ్చు.

Updated Date - 2021-06-24T14:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising