ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అవినీతి బాగోతం బయట పెట్టిన వైసీపీ నేత..

ABN, First Publish Date - 2021-12-31T15:39:17+05:30

ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కావాలంటే పేదలు ముడుపులు ముట్టజెప్పాల్సిందే అనే ఆరోపణలకు నిదర్శనంగా నిలిచే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కావాలంటే పేదలు ముడుపులు ముట్టజెప్పాల్సిందే అనే ఆరోపణలకు నిదర్శనంగా నిలిచే ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో వెలుగుచూసింది. ఆ మండల వైసీపీ అధ్యక్షుడే అక్కడి అవినీతి భాగోతాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. 


సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తుందంటూ కృష్ణాజిల్లా, మోపిదేవి మండల వైసీపీ అధ్యక్షుడు మోహన శివరాజయ్య మీడియా ముందు వాపోయారు. తమ గ్రామానికి చెందిన రాజులపాటి నాగమల్లేశ్వరరావుకు అన్ని అర్హతలు ఉన్నా ఇంటి పట్టా ఇవ్వకుండా.. ఇప్పటికే ఇల్లున్న అతని సోదరుడికి పట్టా ఇచ్చారని ఆయన తెలిపారు. ఇదేంటని అడిగితే రూ. 20వేలు ఇస్తేనే పట్టా ఇస్తామంటున్నారని ఆయన ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం అవినీతి మయంగా మారిపోయిందని, తమ గ్రామానికి చెందిన పలువురు నుంచి తహసీల్దార్ లంచం తీసుకున్నారని శివరాజయ్య ఆరోపించారు.

Updated Date - 2021-12-31T15:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising