ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండపల్లి చైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

ABN, First Publish Date - 2021-11-24T12:52:44+05:30

కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు జరుగనున్న కొండపల్లి పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజుల నుంచి హైడ్రామాల మధ్య ఎన్నిక వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారి శివ నారాయణ రెడ్డి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌ పరిసరాల్లో బారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ ఆఫీస్‌కు వచ్చే అన్నిదారులను పోలీసులు నిర్బంధించారు.  కాగా... ఈ రోజు కూడా ఎన్నిక సవ్యంగా జరగకుండా చేసేందుకు వైసీపీ కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ, వైసీపీ శిబిరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కొండపల్లి మున్సిపల్‌ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉండగా... టీడీపీకి 15, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. ఎక్స్‌అఫిషియో ఓట్లు కలిపి టీడీపీ 16, వైసీపీకి 15 మంది సభ్యులు ఉన్నారు. 

Updated Date - 2021-11-24T12:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising