ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ ప్రాధాన్యతలు భేష్‌

ABN, First Publish Date - 2021-10-18T06:05:54+05:30

వ్యవసాయ ప్రాధాన్యతలు భేష్‌

తుక్కులూరు రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శనలను తిలకిస్తున్న ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ కితాబు

నూజివీడు రూరల్‌, అక్టోబరు 17 : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధన్యమిస్తూ దేశం మొత్తాన్ని ఇటువైపు తిప్పుకొంటున్నారని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ తెలిపారు. నూజివీడు మండలంలోని తుక్కులూరు రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి ప్రసాద్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి రైతుల సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి, తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు వచ్చామన్నారు. అనంతరం తుక్కులూరు రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటుచేసిన వివిధ ప్రదర్శనలను తిలకించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ రైతు భరోసా కేంద్రాల పనితీరు, వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కేరళ ఆర్థిక శాఖ కమిషన్‌ చైౖర్మన్‌ ఎస్‌ఎం విజయానంద్‌, బృంద సభ్యులు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ టి.సుభాష్‌, వ్యవసాయ శాఖ ప్లానింగ్‌ బోర్డు సభ్యులు ఎస్‌ఎస్‌ నగేష్‌, ఉప సంచాలకులు ఎంఎస్‌ ప్రమోద్‌కుమార్‌, కేఎస్‌ ప్రతాప్‌, వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ మోహనరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కవిత, మండల వ్యవసాయశాఖ అధికారిణి చాముండేశ్వరి, తుక్కులూరు గ్రామ సర్పంచ్‌ తొమ్మండ్రు బుజ్జి, వైసీపీ నాయకులు పాలడుగు విజయ్‌కుమార్‌, అచ్చి కాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T06:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising