ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ టీటీ పోటీల్లో కేబీఎన్‌ విద్యార్థిని ప్రతిభ

ABN, First Publish Date - 2021-03-03T06:28:51+05:30

32వ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలలో కేబిఎన్‌ కళాశాల విద్యార్థిని ఆర్‌.కాజోల్‌ సునార్‌ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి క్వాలిఫై రౌండుకు చేరుకుందని కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.వరప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, మార్చి 2 : 32వ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలలో కేబిఎన్‌ కళాశాల విద్యార్థిని ఆర్‌.కాజోల్‌ సునార్‌ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి క్వాలిఫై రౌండుకు చేరుకుందని కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.వరప్రసాద్‌ తెలిపారు. గత వారంలో హరియానాలో 32వ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఆ పోటీల్లో వరుసగా మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలపై అద్భుతమైన ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. క్వాలిఫై రౌండ్‌కి చేరుకుందని తెలిపారు. ఇండియా నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఢిల్లీకి చెందిన మల్లికాతాత్రాపై పోరాడి ఓడినదని పేర్కొన్నారు. కాజోల్‌ తన ప్రతిభతో రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కాజోల్‌ సునార్‌ను, ఆమెను తీర్చిదిద్దిన ఫిజికల్‌ డైరెక్టర్‌ హేమచంద్రరావును కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నవీన్‌ కుమార్‌లు అభినందించినట్లు వివరించారు.

Updated Date - 2021-03-03T06:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising