కడపలో హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ABN, First Publish Date - 2021-10-21T18:15:00+05:30
నగరంలో హైటెక్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప: నగరంలో హైటెక్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాతో పాటు పలు జిల్లాలకు చెందిన 8 మంది ముఠాను చిన్నచౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 18.65 లక్షల రూపాయల నగదు, అకౌంట్ ఫ్రీజ్, 4 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. 3 క్యూనికేటర్ సెట్లు, 4 ల్యాప్ టాప్లు, ఒక కారు, 115 కీ ప్యాడ్ మొబైల్ ఫోన్లు, 10 ఆండ్రాయిడ్ మొబైల్స్, క్రికెట్ బెట్టింగ్‌కు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు.
Updated Date - 2021-10-21T18:15:00+05:30 IST