ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారింది: జవహర్

ABN, First Publish Date - 2021-10-19T15:51:40+05:30

ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యేనని మాజీ మంత్రి జవహర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దళిత నేత ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యేనని, బెదిరింపులతో దళిత నాయకత్వాన్ని కట్టడి చేయలేరని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వారసులుగా అక్రమాలను దౌర్జన్యాలను ఎండగడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోపణలు చేసిన వారిని ఆధారాలు అడగడం పోలీస్ వ్యవస్థ చేతకాని తనానికి  నిదర్శనమన్నారు. పోలీసులు, దొంగలు ఒక్కటయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్నారు. పాలకులే అక్రమార్జనకు కేరాప్ అడ్రస్‌గా మారారని విమర్శించారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని, ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి అని టైపు చేస్తే ఏపీ కనపడుతుందన్నారు. సార రహిత జిల్లాలను నాటు సారా జిల్లాలుగా మార్చారని, ఏపీని మాదక ద్రవ్య రాజధాని చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా వేధింపులు ఆపకపోతే జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని జవహర్ అన్నారు.

Updated Date - 2021-10-19T15:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising