ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల మౌనం దేనికి సంకేతం: జవహర్

ABN, First Publish Date - 2021-10-06T16:33:08+05:30

సమయం వచ్చినా ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగా ఉండడం దేనికి సంకేతమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సమయం వచ్చినా ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగా ఉండడం దేనికి సంకేతమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 36 నెలలుగా పీఆర్సీ కాలం వృధా అయిందన్నారు. ఏడాది కాలంగా నివేధిక కోల్డ్ స్టోరేజికే పరిమితమయితే ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడరెందుకని నిలదీశారు. ఐదు డిఏ బకాయిల సంగతే మరిచారన్నారు. వారం రోజులలో సీపీఎస్ రద్దు అని మాటిచ్చిన జగన్ రెడ్డి మాట నిలబెట్టేదెప్పుడని ప్రశ్నించారు. వారం వారం ప్రత్యేక రైలు బండ్లు ఎందుకు ఆగాయన్నారు. ఉద్యోగుల వసతికి తాళం పడితే ప్రశ్నించాల్సిన సంఘమెక్కడుందన్నారు. సకాలంలో అందని బకాయిలు, జీత భత్యాలమాటే మరిచారన్నారు. ఖాళీల భర్తి లేక అదనపు పని గంటల మాటేంటన్నారు. ఇలా చెపుకుంటు పోతే చాంతాడంత కష్టాలు ఉన్నాయని, వీటన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు మౌనం వీడేదెప్పుడని జవహర్ ప్రశ్నించారు.


Updated Date - 2021-10-06T16:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising