ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వెల్లంపల్లికి పోతిన మహేష్ బహిరంగ సవాల్

ABN, First Publish Date - 2021-07-19T18:27:54+05:30

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ బహిరంగ సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దేవాదాయశాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి వెల్లంపల్లికి జి.ఓ61తో లబ్ది పొందిన సంస్థకు అందులోని వ్యక్తులకు సంబంధం లేదని దుర్గమ్మపై ప్రమాణం చేయాలన్నారు. తప్పు చేయకుంటే ధైర్యంగా శుక్రవారం మంత్రి దుర్గమ్మ కొండకి రావాలని...నేను అన్న ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు చేరుకుంటానని మహేష్ తెలిపారు. 


తాడేపల్లిలో క్యాపిటల్ బిసినెస్ పార్క్‌కి జీఓ 61 ద్వారా లబ్ది చేకూర్చుతూ...మంత్రి వెల్లంపల్లి మరోస్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. ఇందులో ఉన్న నలుగురు పార్టనర్లు వెల్లంపల్లి పక్కనే ఉండేవారన్నారు. వెల్లంపల్లి మిత్ర బృందానికి 30 కోట్ల రూపాయలు రాయతి ఇచ్చారని ఆరోపించారు. వెల్లంపల్లి బినామీ వ్యవస్థకు జీఓ తెచ్చి స్కామ్ చేస్తుంటే జనసేన చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సీఎం దృష్టిలో లేకుండా మేకపాటి గౌతమ్ రెడ్డి జీవో తెచ్చాన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో లేని ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి కోసం జీ.ఓ తెచ్చారని తెలిపారు. మంత్రులు ఇద్దరు కమిషన్ పంచుకుంటున్నారని ఆరోపించారు. ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని... సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వస్త్రాలతా కాంప్లెక్స్‌ని ఖాళీ చెయ్యాలని వత్తిడి చేసి, క్యాపిటల్ బిసినెస్ పార్క్‌కి తరలించారని వెల్లంపల్లి చూస్తున్నారని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-07-19T18:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising