ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు పోలీస్ అధికారి రాజేశ్వరిని ప్రశంసించిన Pawan

ABN, First Publish Date - 2021-11-12T14:40:00+05:30

చెన్నై వరదల సమయంలో తమిళనాడు పోలీసు అధికారిణి రాజేశ్వరి సేవలు ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చెన్నై వరదల సమయంలో తమిళనాడు పోలీసు అధికారిణి రాజేశ్వరి సేవలను ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆమె  స్ఫూర్తిదాయకమైన సేవలకు  జనసేన తరఫున అభినందనలు తెలియజేశారు. అలాగే పద్మ అవార్డు గ్రహీత అయిన యడ్ల గోపాలరావుకి పవన్ ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 


ఎస్‌ఐ రాజేశ్వరి సేవ...

చెన్నై టీపీ ఛత్రం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రాజేశ్వరి ముంపు బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఉండగా...ఫోన్ రావడంతో కీల్పాక్‌లోని సిమెట్రీ వద్ద ఫుట్‌పాత్‌‌ వద్దకు వెళ్లారు.  వర్షానికి బాగా తడిసి, ఫుట్‌పాత్‌మీద అచేతన స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. అందరూ చనిపోయాడనే భావించారు. దగ్గరకు వెళ్లిన ఎస్‌ఐ పరిశీలించి చూడగా ఇంకా ఊపిరి ఉన్నట్టు తేలింది. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని అనుకున్నారు. అయితే, తడిసిపోయి మురికిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాజేశ్వరి స్వయంగా భుజాలపై ఎత్తుకుని ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఎస్సైని పోలీస్‌ ఉన్నతాధికారులతో పాటు నగరవాసులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.



Updated Date - 2021-11-12T14:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising