ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుట్టేద్దాం.. ఉత్తర భారతం..

ABN, First Publish Date - 2021-07-24T06:53:11+05:30

ఆధ్యాత్మిక, వినోద, విజ్ఞాన ప్రాంతాల పర్యటనలతో యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌’ సంస్థ (ఐఆర్‌సీటీసీ) తాజాగా మరో ప్రత్యేక టూరిజం రైలును ఉత్తర భారత యాత్ర పేరుతో ఆగస్టు 27 నుంచి ప్రారంభించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేక టూరిస్టు రైలును ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

ఆగస్టు 27న రేణిగుంట నుంచి ప్రారంభం 

ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్‌ సత్య

రైల్వేస్టేషన్‌, జూలై 23 : ఆధ్యాత్మిక, వినోద, విజ్ఞాన ప్రాంతాల పర్యటనలతో యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌’ సంస్థ (ఐఆర్‌సీటీసీ) తాజాగా మరో ప్రత్యేక టూరిజం రైలును ఉత్తర భారత యాత్ర పేరుతో ఆగస్టు 27 నుంచి ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఆర్‌సీటీసీ డెప్యుటీ జనరల్‌ మేనేజర్‌ కిషోర్‌సత్య, రీజనల్‌ మేనేజర్‌ టి.మురళీకృష్ణ, తమ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆగస్టు 27న ఉదయం రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుం చి ఉత్తర భారత యాత్ర ప్రారంభం అవుతుంది. విజయవాడ, నల్గొండ, సికింద్రాబాద్‌, కాజీపేట మీదుగా ఆగ్రా, మధురై, వైష్ణోదేవి, అమృత్‌సర్‌, హరిద్వార్‌, న్యూ ఢిల్లీలో పలు ఆధ్యాత్మిక, విజ్ఞాన, వినోద ప్రాంతాల సందర్శన ఉంటుంది. మొత్తం 10 రాత్రులు, 11 పగళ్ల ప్రయాణం ఉంటుంది. తిరిగి సెప్టెంబరు 6న ఉదయం రైలు రేణిగుంటకు చేరుకుంటుంది.

టారిఫ్‌ వివరాలు

స్లీపర్‌ క్లాస్‌ ఒక్కొక్కరికి రూ. 10,400, ఏసీ త్రీటైర్‌ ఒక్కొక్కరికి రూ.17,330గా నిర్ణయించారు. ఉదయం కాఫీ, అల్పాహారం, భోజనం, విందు, వసతి రోడ్డు మార్గాల ప్రయాణాలతో కలుపుకుని ఈ ధరలను నిర్ణయించారు. కొవిడ్‌ నిబంధనలను 100శాతం పాటించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు విజయవాడలో గల ఐఆర్‌సీటీసీ కార్యాలయానికి - 82879 32313, 97013 60675 నెంబర్‌లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.

Updated Date - 2021-07-24T06:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising