ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందుపల్లిలో సచివాలయ భవనాలకు శంకుస్థాపన

ABN, First Publish Date - 2021-05-17T06:27:34+05:30

గ్రామ సచివాలయాల వ్యవస్థలను పటిష్ఠం చేసి సుపరిపాలన అందించటమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఇందుపల్లి గ్రామసర్పంచ్‌ బండి వెంకటలక్ష్మి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, మే 16 : గ్రామ సచివాలయాల వ్యవస్థలను పటిష్ఠం చేసి  సుపరిపాలన అందించటమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఇందుపల్లి గ్రామసర్పంచ్‌ బండి వెంకటలక్ష్మి అన్నారు.  ఇందుపల్లిలో సుమారు రూ.66 లక్షల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న నూతన సచివాలయం, ఆర్బీకే భవనాలకు ఆదివారం ఆమె భూమిపూజ చేశారు. పంచాయతీ కార్యదర్శి నర్రా ప్రసాద్‌ మాట్లాడుతూ సచివాలయ భవన నిర్మాణానికి రూ.40లక్షలు, రైతుభరోసాకేంద్రం నిర్మాణానికి రూ.22లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. కాంట్రాక్టర్‌ కూరాకుల తులసీరావుకి ఆయా భవనాల నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వార్డుసభ్యులు ఎం.వాణి, పి.గోవర్దన్‌, కె.రాజ్యలక్ష్మి, గ్రామపెద్దలు శేఖర్‌, వెంకట్రామయ్య, వలంటీర్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. మండలస్ధాయి అధికారులెవరూ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకాక పోవడం గమనార్హం. దీనిపై సెక్రటరీని వివరణకోరగా ఆదివారం సెలవుదినం కావటంతో ఉన్నతాధికారులను ఆహ్వానించలేదన్నారు.  

Updated Date - 2021-05-17T06:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising