ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాజ-గుండుగొలను ప్రాజెక్టుకు అవరోధాలు

ABN, First Publish Date - 2021-01-22T06:48:53+05:30

కాజ-గుండుగొలను మెగా రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో అంతర్భాగంగా చేపడుతున్న ప్యాకేజీ పనులకు భూ ఇబ్బందులు అవరోధాలుగా మారుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాజ-గుండుగొలను ప్రాజెక్టుకు భూమి కష్టాలు

కీలకమైన ప్యాకేజీ-2, 3 పనులకు ఆటంకాలు

ప్యాకేజీ-1, 4 పనులపైనా ప్రభావం 

మూడు ప్రాంతాల్లో భూముల సమస్య 

ఆటంకాలను అధిగమించకుంటే తీవ్ర జాప్యం 


కాజ-గుండుగొలను మెగా రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో అంతర్భాగంగా చేపడుతున్న ప్యాకేజీ పనులకు భూ ఇబ్బందులు అవరోధాలుగా మారుతున్నాయి. అత్యంత కీలకమైన ప్యాకేజీ-2, 3 పనుల్లోనే ఈ భూ సేకరణ ఇబ్బందులు తలెత్తటం వల్ల ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. 


ఆంరఽధజ్యోతి, విజయవాడ : రెండు అతి పెద్ద జాతీయ రహదారులైన ఎన్‌హెచ్‌-16, ఎన్‌హెచ్‌ 65లను అనుసంధానం చేసే అతి ముఖ్యమైన కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టుకు భూమి సమస్యలు ఆటంకంగా మారాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎంతో సౌకర్యవంతమైన రోడ్డు ప్రాజెక్టు ఇది. ఏలూరు, విజయవాడ, గుంటూరు నగరాలకు భారీ ట్రాఫిక్‌ను నియంత్రించి, విజయవాడ నగరం వెలుపల నుంచే వెళ్లిపోవటానికి వీలు కల్పించే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టును దశాబ్దం క్రితమే ప్రారంభించినా.. అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు దశాబ్దం క్రితమే భూ సేకరణ పూర్తయింది. ఈ దశాబ్ద కాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవటం, ఈ కాలంలో భూముల ధరలు పెరగడంతో భూములు ఇచ్చిన రైతులు కొందరు తాము నష్టపోయామన్న భావనతో పరిహారాన్ని పెంచమని కోర్టుకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. 


 ప్యాకేజీ-2, 3 పనులకే సమస్య 

ప్రాజెక్టు పనులకు ఇది అవరోధంగా మారింది. కాజ-గుండుగొలను మెగా ప్రాజెక్టులో ప్యాకేజీ-1, 4లకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తలేదు. ప్యాకేజీ-2, 3 పనులకే ఈ సమస్య వచ్చిపడింది. ఈ ప్యాకేజీలకు నూరు శాతం భూ సేకరణ గతంలోనే జరిగినా.. ఐదు శాతానికి సంబంధించి కేసులు నడుస్తూనే ఉన్నాయి. ప్యాకేజీ-2లో కలపర్రు-చినఅవుటపల్లి, జంక్షన్‌ బైపాస్‌ పనులు దాదాపు 80 శాతం చకచకా జరిగిపోయాయి. ప్యాకేజీ పూర్తయ్యే సమయానికి భూ సమస్యలు వచ్చి పడ్డాయి. ఐదెకరాల భూములను సేకరించాల్సి రాగా, వీటికి తగిన పరిహారం ఇవ్వలేదని అధికార పార్టీకి చెందిన ఒక నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే గ్రామంలోని భూములను సేకరించే విషయంలో వేర్వేరు ఽవిధానాలను అవలంభించటంతో వల్ల ఈ సమస్య తలెత్తింది. పరిహార ం ఎక్కువ డిమాండ్‌ చేయటంతో కేంద్రం అంగీకరించడం లేదు. దీంతో జంక్షన్‌ బైపాస్‌ పనులు ఆగిపోయాయి. కలపర్రు - చినఅవుటపల్లి ప్యాకేజీ-1 పనులు పురోగతిలో ఉన్నా, గుండగొలను -కలపర్రుకు అనుసంధానించలేకపోతున్నారు. 


ప్యాకేజీ-3 విజయవాడ బైపాస్‌ (చిన అవుటపల్లి-గొల్లపూడి) పనులకు కూడా బ్రేక్‌ పడింది. గొల్లపూడి దగ్గర రైతులు తాము నష్టపోతున్నామని, పరిహారం పెంచాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా రైతులతో మాట్లాడి మధ్యే మార్గంగా పరిష్కరించుకోవాలని నిర్దేశించింది. కోర్టు నిర్దేశించిన ప్రకారం ఈ సమస్య పరిష్కారానికి జాతీయ రహదారుల సంస్థ కూడా కృషి చేస్తున్నా, ఇంకా అపరిష్కృతంగానే ఉంది. గొల్లపూడిలో తలెత్తిన ఈ సమస్య ప్యాకేజీ-4పై కూడా ప్రభావం చూపుతోంది. గొల్లపూడి నుంచి కృష్ణానది మీదుగా ఆరు వరసల వంతెన, రోడ్డు పనులు కాజ వరకు జరగాల్సి ఉంటుంది. ప్రారంభంలోనే ప్యాకేజీ-3తో అనుసంధానం కావాల్సిన చోట భూ సమస్యలు ప్యాకేజీ-4కు కూడా ఇబ్బందిగానే ఉంటాయి. ప్యాకేజీ-3 పనులకు సంబంధించి బాహుబాలేంద్రుని గూడెంలో కూడా రైతుల నుంచి పరిహారం విషయంలో అభ్యంతరాలు వచ్చాయి. ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియాలో ఉన్నందున తమకు మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతులు ఆర్బిట్రేషన్‌ వేశారు. పరిష్కారం లభించలేదు. ప్యాకేజీ-3 పనులకు సంబంధించి భూ వివాదాలు తేలకపోవటంతో కేంద్ర ప్రభుత్వం ఇంకా కాంట్రాక్టు సంస్థకు అపాయింట్‌ డేట్‌ ఇవ్వలేదు. ఫలితంగా ప్యాకేజీ-3 పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించలేకపోతే మెగా ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్‌హెచ్‌ జోక్యం చేసుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం లేదు. 

Updated Date - 2021-01-22T06:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising