ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి

ABN, First Publish Date - 2021-09-29T06:36:09+05:30

జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలు వేగవంగా పూర్తి కావాలని సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయిప్రవీణ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు.

మొర్సుమల్లిలో ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ 

మైలవరం, సెప్టెంబరు 28 : జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలు వేగవంగా పూర్తి కావాలని సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయిప్రవీణ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తగు సూచనలు చేశారు. మండలంలో 2400లకు పైగా ఇళ్లు నిర్మించడానికి అనుమతులు వచ్చాయని, అదనంగా మరికొన్ని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇసుక, సిమెంట్‌, ఇనుము ఇవ్వడం జరుగుతుందన్నారు. జగనన్న కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలన్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి పోలీసుల పనితీరును అడిగి తెలసుకున్నారు. ముందుగా పుల్లూరు గ్రామం సీతారామపురం తండాలో పర్యటించి ఆర్‌వోఎ్‌ఫఆర్వో భూములను పరిశీలించారు. మొర్సుమల్లి గ్రామ సచివాలయాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని సబ్‌ కలెక్టర్‌ పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని సూచించారు. అయ్యప్ప నగర్‌ పట్టాలు రెండు వారాల్లో లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. తహసీల్దార్‌ రోహిణీదేవి, ఎంపీడీవో సుబ్బారావు, హౌసింగ్‌ డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ భాస్కర్‌రెడ్డి, ఫారెస్ట్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T06:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising