ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మామిడి మార్కెట్లు

ABN, First Publish Date - 2021-05-20T06:30:59+05:30

మండల ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. మామిడి మార్కెట్‌లే కరో నా వ్యాప్తికి కారణంగా పలువురు పేర్కొంటున్నారు. కరో నా హాట్‌స్పాట్‌లుగా మామిడి మార్కెట్లు మారాయి. కమీషన్ల కోసం కక్కుర్తిపడి మామిడి మార్కెట్ల యజమానులు కరోనా నిబంధనల్ని కాలరాస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

మాస్క్‌లు లేకుండా పనిచేస్తున్న గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కమీషన్ల కోసం కక్కుర్తి

ఉత్తరాది రాష్ర్టాల కూలీలతో పనులు

 కరోనా నిబంధనలు పాటించని వైనం 

విస్సన్నపేట, మే 19 : మండల ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు.  మామిడి మార్కెట్‌లే కరో నా వ్యాప్తికి కారణంగా పలువురు పేర్కొంటున్నారు. కరో నా హాట్‌స్పాట్‌లుగా మామిడి మార్కెట్లు మారాయి. కమీషన్ల కోసం కక్కుర్తిపడి మామిడి మార్కెట్ల యజమానులు కరోనా నిబంధనల్ని కాలరాస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్నా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మామిడి కూలీలను తక్కువ కూలికి ఇక్కడకు తీసుకువచ్చి వారితో గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేయిస్తున్నారు. ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన లారీల రాకపోకలతో మండలంలో కేసులు విపరీతంగా పెరిగి పలువురు మృత్యువాత పడ్డారని స్థానికులు తెలిపారు. అధికారుల ఆదేశాలను సైతం యజమానులు బేఖాతరు చేస్తున్నారు. మార్కెట్లలో భౌతికదూరం పాటించడం లేదని, శానిటైజర్లు, మాస్క్‌లు వాడటం లేదని తెలిపారు.  కనీసం గ్రామ పంచాయతీ నుంచి లైసెన్సు కూడా పొందకపోవడం గమనార్హం. మా మిడి మార్కెట్లతో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.  

Updated Date - 2021-05-20T06:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising