ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నా అల్లుడు చాలా మంచోడు’

ABN, First Publish Date - 2021-04-13T06:27:20+05:30

సూర్యరత్నప్రభపై హోంగార్డు వినోద్‌కుమారే..

భార్య సూర్యరత్నప్రభతో హోంగార్డు వినోద్‌కుమార్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లుడికి అత్త క్లీన్‌చిట్‌

హత్య కాదంటున్న మృతురాలి తల్లి

వినోద్‌కుమార్‌పై రెండు కుటుంబాల్లోనూ సదభిప్రాయం


(ఆంధ్రజ్యోతి - విజయవాడ): సూర్యరత్నప్రభపై హోంగార్డు వినోద్‌కుమారే కాల్పులు జరిపినట్టు పోలీసులు బలంగా అనుమానిస్తుండగా, మరోపక్క వినోద్‌కుమార్‌ మంచివాడని ఇరు కుటుంబాలవారూ కితాబునిస్తున్నారు. ‘నా అల్లుడు చాలా మంచోడు’ అని మీడియా ముందు వినోద్‌కుమార్‌ అత్త వరలక్ష్మి చెప్పింది. సూర్యరత్నప్రభను అత్తమామలు కూడా సొంత కూతురిలా చూసుకునేవారని ఆమె చెప్పింది. నిందితుడి పెద్దత్త, అతడి మేనత్త కూడా ఇదే మాట చెబుతున్నారు. 


అందరిదీ అదే కథ

‘వినోద్‌కుమార్‌ తన అధికారిని ఇంటి వద్ద దించిన తర్వాత భవానీపురంలో ఇంటికి వచ్చాడు. తర్వాత బ్యాగ్‌ను టేబుల్‌పై పెట్టి స్నానానికి వెళ్లాడు. బ్యాగ్‌ను చూస్తున్న మా అమ్మాయికి పిస్టల్‌ కనిపించింది. దాన్ని బయటకు తీసి చూడగా, జారి కింద పడింది. అది పేలడంతో బుల్లెట్‌ భుజానికి తగిలింది’ అని మృతురాలి తల్లి వరలక్ష్మి చెప్పింది. వినోద్‌కుమార్‌ కూడా మొదట ఇదే కథ వినిపించాడు. అయితే అధికారి పిస్టల్‌ను వినోద్‌కుమార్‌ తన బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి తీసుకురావడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఆభరణాలే ఇంతపని చేశాయా?

2019లో సూర్యరత్నప్రభను వినోద్‌కుమార్‌ ప్రేమవివాహం చేసుకున్నప్పటికీ, ఏనాడూ వేధించలేదు. ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపోయేవారు. ఈ కారణాలన్నీ వారిద్దరూ చిలకాగోరింకల్లా కలిసి ఉంటున్నారనే భావనను రెండు కుటుంబాల్లో కలిగించాయి. అయితే జనవరిలో భార్య బంగారు ఆభరణాలను మణప్పురం బ్యాంక్‌లో తాకట్టుపెట్టి, వినోద్‌కుమార్‌ రుణం తీసుకున్నాడు. ఎస్‌బీఐలో తీసుకున్న అప్పును తీర్చడానికి ఈ వస్తువులను తాకట్టు పెట్టాడని చెబుతున్నారు. పోలీసు సిబ్బందికి వేతనాలను ఐసీఐసీఐ బ్యాంక్‌ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ బ్యాంక్‌ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందుకే ఎస్‌బీఐలో రుణం తీర్చి, ఆ ఖాతాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్చుకోవడానికి వినోద్‌కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఖాతా ఐసీఐసీఐ బ్యాంక్‌కు బదిలీ అయితే రూ.3లక్షల వరకు రుణం వచ్చే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఖాతా బదిలీలో జాప్యం జరగుతుండడంతో, వచ్చే నెలలో పెద్దనాన్న కుమారుడి వివాహానికి వెళ్లాలని, ఆభరణాలు కావాలని భార్య నిలదీసిందని అంటున్నారు. ఆదివారం రాత్రి ఈ విషయమై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందని, ఆవేశంలో వినోద్‌కుమార్‌ భార్య ప్రాణాలు తీసి ఉంటాడని భావిస్తున్నారు. హోంగార్డే ఈ హత్య చేశాడని పోలీసులు చెబుతుండగా, మృతిరాలి కుటుంబీకులు అతడికి క్లీన్‌చిట్‌ ఇవ్వడం గమనార్హం. 

Updated Date - 2021-04-13T06:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising