ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విస్సన్నపేటలో భారీ వర్షం

ABN, First Publish Date - 2021-05-14T05:38:23+05:30

విస్సన్నపేటలో భారీ వర్షం

గౌరంపాలెంలో నేలకొరిగిన మామిడి చెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేలకొరిగిన చెట్లు

మామిడికి తీవ్ర నష్టం

విస్సన్నపేట, మే 13: మండలంలో గురువారం ఈదురుగాలలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడి గాలి వానకు నేలరాలింది. భారీ చెట్లు  ఈదురు గాలులకు నేలకొరిగాయి. అసలే మామిడికి ధర లేక దిగాలుగా ఉన్న రైతుపై అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. 




చాట్రాయి మండలంలో 70 శాతం పంట కల్లాలలోనే..

చాట్రాయి: మండలంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, ధాన్యం, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు మందగొడిగా సాగుతుండటంతో 70 శాతం పంట కల్లాలపైనే ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి బలమైన ఈదురుగాలులు తోడవడంతో చెట్లకు ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక మామిడి కాయలు కోతలు సరిగా జరగడంలేదు. ఇంకా అకాల వర్షాలు కొనసాగితే పంట సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు కలవర పడుతున్నారు.


Updated Date - 2021-05-14T05:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising