ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్కా డాన్స్‌ ఎక్కడ?

ABN, First Publish Date - 2021-06-18T05:16:08+05:30

గుట్కా డాన్స్‌ ఎక్కడ?

గురువారం రాత్రి వన్‌టౌన్‌లోని గోడౌన్లలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌ కేంద్రంగా భారీ గోడౌన్లు

హైదరాబాద్‌, బెంగళూరు నుంచి భారీగా కొనుగోళ్లు

రూ.86లక్షల గుట్కా, ఖైనీలు స్వాధీనం

విజయవాడ, ఆంధ్రజ్యోతి : నిషేధంతో పనిలేకుండా నగరంలో గుట్కాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వన్‌టౌన్‌ కేంద్రంగా ఉన్న రెండు గోడౌన్లలో గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో రూ.86లక్షల విలువైన సరుకు బయటపడింది. అయితే, గోడౌన్ల యజమానులు పరారయ్యారు. ఈ రెండు గోడౌన్లు కృష్ణలంకకు చెందిన చంద్రికారెడ్డి, సాయిరెడ్డివిగా గుర్తించారు. వీరిద్దరిపై లోగడ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయినా చట్టంలో ఉన్న లొసుగులను అవకాశంగా మార్చుకుని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలకు ఇక్కడి నుంచే సరుకు సరఫరా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, లారీలు.. ఇలా అన్ని మార్గాల్లో ఇతర రాష్ట్రాల నుంచి సరుకును దిగుమతి చేసుకుంటున్నారు. గుట్కా ముసుగులోనే గంజాయి అమ్మకాలు కూడా సాగిస్తున్నారు. సరుకును హైదరాబాద్‌, పుణె, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని అడవుల నుంచి గంజాయి కొంటున్నారు. వివిధ పార్శిల్‌ సర్వీసు వాహనాల ద్వారా సరుకును విజయవాడకు తెప్పిస్తున్నారు. 

హైదరాబాద్‌, బెంగళూరు నుంచి రాక

ఒక ఖైనీ ప్యాకెట్‌ ధర రూ.10 ఉండగా, దాన్ని రూ.40-50కు విక్రయిస్తున్నారు. ఇలా బాక్సులను అమ్మి లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. తాజాగా కర్ఫ్యూ అమలు చేస్తుండటంతో ముందే సరుకును రప్పించుకుని గోడౌన్‌లో భద్రపరుచుకున్నారు. బెంగళూరులో గుట్కాలు, ఖైనీలపై నిషేధం లేదు. అక్కడ బహిరంగంగానే విక్రయిస్తారు. ఇక హైదరాబాద్‌లో మాత్రం చాటుమాటుగానే అమ్మకాలు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే బెంగళూరు నుంచి వచ్చిన రూ.20 లక్షల గుట్కా, ఖైనీలను పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చిన మరో రూ.30 లక్షల సరుకును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గోడౌన్లలో వివిధ బ్రాండ్ల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.86లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం సరుకుల్లో ఇదే అతిపెద్దది. 


Updated Date - 2021-06-18T05:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising