ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరా జీవితాచరణే నాస్తికత్వానికి ప్రతిబింబం

ABN, First Publish Date - 2021-11-16T06:40:30+05:30

గోరా గొప్ప మానవతా వాది, మంచి దార్శనికుడు, ఆచరణ వాది, ఆయన జీవిత ఆచరణే నాస్తికత్వానికి ప్రతిబింబం అని చరిత్రకారుడు, రచయిత డాక్టర్‌ హెచ్‌ఎస్‌ఎస్‌ సుందర్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ హెచ్‌ఎస్‌ఎస్‌ సుందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరా జీవితాచరణే నాస్తికత్వానికి ప్రతిబింబం

రచయిత డాక్టర్‌ హెచ్‌ఎస్‌ఎస్‌ సుందర్‌

రామలింగేశ్వరనగర్‌, నవంబరు 15 : గోరా గొప్ప మానవతా వాది, మంచి దార్శనికుడు, ఆచరణ వాది, ఆయన జీవిత ఆచరణే నాస్తికత్వానికి ప్రతిబింబం అని చరిత్రకారుడు, రచయిత డాక్టర్‌ హెచ్‌ఎస్‌ఎస్‌ సుందర్‌ పేర్కొన్నారు. గోరా 119వ జయంతి సందర్భంగా సోమవారం డాక్టర్‌ సమరం అధ్యక్షతన నాస్తిక కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సమసమాజం ఆయన ధ్యేయమని, ఆయన సిద్ధాంతం వ్యక్తికి గౌరవం ఇచ్చేదని సంఘ దృష్టిని పెంచేదని, వాస్తవానికి నిలబడేదని, కులాంతర మతాంతర సమాజ నిర్మాణానికి దిక్సూచి అని అన్నారు. ఈ సందర్భంగా గోరా ‘గాంధీజీతో నేను’ అనే తెలుగు పుస్తకాన్ని, ‘లీవ్స్‌ ఫ్రం గోరాస్‌ లైఫ్‌’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. డాక్టర్‌ మారు, నియంత, రశ్మి, శ్రీహరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-16T06:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising