ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజారాణికి ఉగాది పురస్కారం

ABN, First Publish Date - 2021-04-13T06:03:11+05:30

మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం సీనియర్‌ శాస్త్రవేత్త (ప్లాంట్‌బ్రీడింగ్‌) డాక్టర్‌ గిరిజారాణి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం సీనియర్‌ శాస్త్రవేత్త (ప్లాంట్‌బ్రీడింగ్‌) డాక్టర్‌ గిరిజారాణి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న 8 మందిని ఉగాది పురస్కారాలకు ఎంపిక చేస్తూ ఆచార్య ఎన్‌జీరంగా  వ్యవసాయ  విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ గిరిధరకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.  గిరిజారాణి మార్టేరులో 11 సంవత్సరాలకుపైగా శాస్త్రవేత్తగా పనిచేశారు. ఏడాదిన్నరగా మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం సీనియర్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మార్టేరులో పనిచేసిన కాలంలో ఎంటీయూ 1140, ఎంటీయూ 1172, ఎంటీయూ 1190 వరివంగడాలను గిరిజారాణి కనుగొన్నారు. ఎంటీయూ 1156, 1153, 1159,1233, 1210, 1293 వరి వంగడాల పరిశోధనల్లో ఇతర శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు.  ఆచార్య ఎన్‌రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 


Updated Date - 2021-04-13T06:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising