ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ మాజీ మంత్రి నడకుదిటి కన్నుమూత

ABN, First Publish Date - 2021-04-02T06:56:30+05:30

మాజీ మంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం: మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారన్న వార్త బందరు ప్రజల హృదయాలను కలచి వేసింది. ఒకనాడు నావలు, పడవల తయారీలో నిష్ణాతుడైన నరసింహారావు, తరువాత నవీన ఇండస్ర్టీస్‌ ద్వారా రైస్‌మిల్లులకు అవసరమైన విడి భాగాలను తయారు చేసేవారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్‌ వెంట నడిచారు. 1996 నుంచి 99 వరకు మచిలీపట్నం అర్బన్‌ బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో శాసనసభ్యునిగా విజయం సాధించారు. మత్స్యశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో బందరుకోటలో మత్స్యకారులకు శిక్షణశాలలు ఏర్పాటు చేశారు. నడకుదిటి భౌతిక కాయాన్ని బందరులోని నివాసం వద్ద ఉంచుతారని, శుక్రవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-02T06:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising