ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీవర్‌ సర్వే తీరుపై ఆర్డీవో ఆగ్రహం

ABN, First Publish Date - 2021-08-06T06:42:24+05:30

ఫీవర్‌ సర్వే సక్రమంగా జరగటం లేదని సిబ్బందిపై నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో రాజ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, ఆగస్టు 5 :  ఫీవర్‌ సర్వే సక్రమంగా జరగటం లేదని సిబ్బందిపై నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరు గ్రామ సచివాల యాన్ని గురువారం తనిఖీ చేశారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులను పరిశీలించి, స్పందన ఆర్జీలను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తు న్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలు తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 27 మంది వలంటరీలు వారికి కేటాయించిన 50 గృహల్లో నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతిరోజు 27మందికి  కొవిడ్‌ పరీక్షలు చేయించా లని, ఈ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించాలని మహిళా పోలీసులు, ఇన్‌చార్జి ఎంపీడీవో సాయిరామ్‌ను ఆదేశించారు. రైతుభరోసా కేంద్రంలో రికార్డులను  తనిఖీ చేసి,  పలుసూచనలు చేశారు. పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఏవో శివశంకర్‌ను ఆదేశించారు. 

రెవెన్యూ అధికారులపై ఆగ్రహం..

రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆర్డీవో రాజ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముసునూరు స్పందనలో ఎక్కువ ఆర్జీలు  భూ సమస్యల పై వస్తున్నాయని, వీటి పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ పనితీరు వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని, త్వరగా పరిష్కరించకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్‌ ఎం.పాల్‌, ఏపీవో పౌలురాజు, డీటీ కిషోర్‌బాబు, ఆర్‌ఐ దీపిక, సర్వేయర్‌ వెంకటేశ్వరావు, ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-06T06:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising