ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్లక్ష్యం ఖరీదు రూ.కోటి!

ABN, First Publish Date - 2021-10-26T06:28:44+05:30

అనేక రకాలైన పక్షి జాతులు, చేపలు, కుందేళ్లు, తాబేళ్లు, పిల్లులు, కుక్కపిల్లలు ఇలా వివిధ రకాల పెంపుడు జంతువులు, డెకరేషన్‌ సామగ్రి, వాస్తుకోసం పెట్టే వెదురు చెట్లు, చై నా బొమ్మలు, ప్లాస్టిక్‌ సామగ్రి ఇలా ఒకటేమిటి అన్నీ ఒకే చోట లభించే పెద్ద షోరూమ్‌ ఘర్‌ సంసార్‌ ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతైంది.

అక్వేరియంలో మృత్యువాత పడిన చేపపిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘర్‌ సంసార్‌ షోరూమ్‌లో అగ్నిప్రమాదం

ఆహుతవుతూ విలవిలలాడిన పక్షులు, జంతువులు

పోలీసులు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్ల వద్ద వివరాలు నిల్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 25 : అనేక రకాలైన పక్షి జాతులు, చేపలు, కుందేళ్లు, తాబేళ్లు, పిల్లులు, కుక్కపిల్లలు ఇలా వివిధ రకాల పెంపుడు జంతువులు, డెకరేషన్‌ సామగ్రి, వాస్తుకోసం పెట్టే వెదురు చెట్లు, చై నా బొమ్మలు, ప్లాస్టిక్‌ సామగ్రి ఇలా ఒకటేమిటి అన్నీ ఒకే చోట లభించే పెద్ద షోరూమ్‌ ఘర్‌ సంసార్‌ ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతైంది. ఈ షోరూం బాగా పాపులర్‌ అయింది. నిత్యం లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఆదివారం రాత్రి 9 గంటల దాటిన తరువాత మూసివేశారు. రాత్రి పదిన్నర సమయంలో షార్ట్‌ సర్య్యూట్‌ కారణంగా షోరూమ్‌ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు కానీ అప్పటికే మూగజీవాలు అగ్నికి ఆహుతయ్యాయి. షోరూమ్‌లో ఉన్న అన్నీ అగ్నికి సులభంగా అంటుకునేవి కావడం తో పక్షులు, జంతువులు, తదితరాలు ఆహుతయ్యా యి. సుమారు రూ.కోటి మేరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే పోలీసులు, ఫైర్‌ విభాగాలు మాత్రం తమ వద్ద వివరాలు ఏమీ లేవని చెబుతున్నారు. షోరూమ్‌ యజమానుల పేర్లు స్పష్టం గా తెలియరాలేదు. విశ్వకర్మ గోల్డ్‌ స్మిత్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ యజమాని, షోరూమ్‌ భవన యజమాని అయిన ధనాల కోట శ్రీనివాసరావు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి 10. 54 గంటలకు భవనంలోంచి దట్టంగా పొగలు వస్తున్నాయని, అగ్నిప్రమాదం జరిగిందని ఒకరు ఫోన్‌ చేయడంతో తాను హుటాహుటిన వచ్చినట్లు తెలిపా రు. అప్పటికే భవనంలో దట్టమైన పొగలు, మంటలు కనిపించాయని, గోడలు బీటలు వారాయని, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినట్లు తెలిపారు. ఈయన ఫిర్యాదులోనూ ఘర్‌ సంసార్‌ షోరూమ్‌ నిర్వాహకుల పేర్లను గాని, ఆస్తి నష్టం వివరాలు గానీ, అగ్నిప్రమాదం ఎలా జరిగిఉంటుందన్న సమాచారం గానీ ఇవ్వకపోవడం గమనార్హం. అన్నీ ఇట్టే అగ్నికి ఆహుతయ్యే వస్తువులున్నా అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోకుండా నిర్లక్ష్యం వహించారని చెబుతున్నారు. మూగజీవాలు విలవిలలాడిన తీరు అత్యంత బాధాకరమని పలువురు చెప్పడం, వాటి పరిస్థితి దయనీయంగా మారడం విచారకరం.

Updated Date - 2021-10-26T06:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising