ఎఫ్‌సీఐ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
ABN, First Publish Date - 2021-04-06T06:27:17+05:30
ఎఫ్‌సీఐ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 5 : దేశ రైతాంగానికి 50 ఏళ్లుగా సేవలు అందిస్తున్న భారత ఆహార గిడ్డంగి సంస్థ ను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం అంత్యంత శోచ నీయమని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు పేర్కొన్నారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపులో భాగంగా హనుమాన్ జంక్షన్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యం లో సోమవారం హనుమాన్ జంక్షన్ ఎఫ్‌సీఐ ఎదుట ధర్నా నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీ తన మిత్రుడైన గౌతమ్‌కు ఎఫ్‌సీఐ సంస్థను 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడంతో పాటు అభి వృద్ధి పేరిట రూ.700కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి పూనుకోవడం దుర్మార్గమన్నారు. సంస్థను నిర్వీర్యం చేస్తూ చేపట్టిన చర్యలు వెంటనే ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, గుండపనేని ఉమావరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, కలపాల సూర్యం, మూల్పూరి సాయి కళ్యాణి, సీపీఎం నేతల వై.నరసింహారావు, బేత శ్రీనివాసరావు, అబ్దుల్‌బారీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-06T06:27:17+05:30 IST