ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌.. ఎఫెక్ట్‌!

ABN, First Publish Date - 2021-04-18T06:20:49+05:30

జిల్లాలో పెరుగుతున్న కొవిడ్‌ కేసు ల ప్రభావం నగరంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌పై పడింది! వేలాది మంది స మూహమౌతున్న స్వరాజ్యమైదానంలోని ట్రేడ్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ను జిల్లా యం త్రాంగం రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వరాజ్యమైదానంలో ఎగ్జిబిషన్‌ అనుమతులు రద్దు!

తక్షణం అమల్లోకి వచ్చేలా కలెక్టర్‌ ఆదేశాలు 

విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెరుగుతున్న కొవిడ్‌ కేసు ల ప్రభావం నగరంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌పై పడింది! వేలాది మంది స మూహమౌతున్న స్వరాజ్యమైదానంలోని ట్రేడ్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ను జిల్లా యం త్రాంగం రద్దు చేసింది. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఎగ్జిబిషన్‌ అనుమతులను రద్దు చేసినట్టు కలెక్టర్‌ శనివారం సాయంత్రం ప్రకటించారు. తాము తీసుకున్న నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించకపోతే ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాల్సి వస్తుందని వ్యాపార వర్గాలను హెచ్చరించారు. అంటువ్యాధి చట్టం (ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్టు -1987) మేరకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. స్వరాజ్యమైదానంలో మార్చి 14 - మే 31 వరకు ఇచ్చిన అనుమతులను ఈ చట్టం ప్రకారమే రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని, కేంద్ర వైద్యారోగ్యశాఖ రూపొందించిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ను అనుసరించామన్నారు. ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇచ్చిన సందర్భంలో జిల్లా వ్యాప్తంగా 24 కేసులు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం 493 కేసులకు పెరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎగ్జిబిషన్‌ అనుమతులు రద్దు చేశామని తెలిపారు.

Updated Date - 2021-04-18T06:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising