ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. కోటితో ఎనికేపాడు అభివృద్ధి

ABN, First Publish Date - 2021-06-12T06:18:38+05:30

రూ. కోటితో ఎనికేపాడు అభివృద్ధి

పంచాయతీ పాలకవర్గ సమావేశంలో సర్పంచ్‌ పూర్ణచంద్రరావు, సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ డ్రెయినేజీ వ్యవస్థ పటిష్టతకు నిర్ణయం

ఫపంచాయతీ పాలకవర్గ సమావేశం తీర్మానం

విజయవాడ రూరల్‌, జూన్‌ 11 : ఎనికేపాడులో రూ.కోటితో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్‌ రాచమళ్ల పూర్ణచంద్రరావు అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. గ్రామంలోని అన్ని ప్రాంతాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచేందుకు సమావేశం నిర్ణయించింది. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇన్‌చార్జి కార్యదర్శి  కృపాకుమార్‌ తొలుత అజెండాను ప్రవేశపెట్టారు.  రూ.కోటితో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రధాన రహదారులతోపాటు రైల్వేకట్టరోడ్డు, వీకేఆర్‌ కాలనీ, శివాలయం, పల్లాలు ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని తీర్మానించారు. అలాగే గ్రామంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం, పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న కుంట పోరంబోకు స్థలాన్ని సర్వే చేయాలని, అనంతరం పూడికతీయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్‌ టంకసాల శివప్రసాద్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-12T06:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising