ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో ఉపాధి మార్గాలు కనుమరుగు : గద్దె

ABN, First Publish Date - 2021-08-19T17:00:41+05:30

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామలింగేశ్వరనగర్‌: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చేతకాని పాలనలో రాష్ట్ర ప్రజలకు ఉపాధి మార్గాలు కనుమరుగయ్యాయని  ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌  పేర్కొన్నారు. బుధవారం ఆయన 15వ డివిజన్‌ రామలింగేశ్వర నగర్‌లోని వీఎంఆర్‌ రోడ్డులో పర్యటించి నిరుపేద రజక కుటుంబానికి చెందిన సారిక ఏసుకు రూ.30 వేల విలువ చేసే ఇస్త్రీ పెట్టెను గద్దె ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్‌ కాలు పెట్టిన తరువాత అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని, ప్రభుత్వ ధోరణితో ప్రఖ్యాత కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారి ప్రజల్లోకి వస్తే వారు పడే ఇబ్బందులు తెలుస్తాయని గద్దె  తెలిపారు. రత్నం రమేష్‌, బేతు రామమోహన్‌, చిన్నం ఈశ్వరరావు, పేరేపి ఈశ్వర్‌, సింగంశెట్టి రమేష్‌, నందమూరి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


ఎలక్ర్టికల్‌ కార్మికులకు చేయూతనివ్వాలి

పటమట: ప్రైవేటు ఎలక్ర్టికల్‌ కార్మికులకు చేయూతనివ్వాలని ఏపీ ప్రైవేటు ఎలక్ర్టికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కోరారు. బుధవారం అశోక్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో గద్దె రామ్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గద్దెతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 5 లక్షలు పైగా ప్రైవేటు ఎలక్ర్టికల్‌ కార్మికులు ఉన్నారన్నారు. తమకు ఏడాదికి ఆరు నెలలు మాత్రమే పనులు దొరుకుతున్నాయని మిగిలిన ఆరు నెలలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిచాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు చనుమోలు రాంబాబు, కె. శ్రీహరి రావు, ధనేకుల సత్యనారాయణ, ఎం. హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-19T17:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising