ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనో వికాసానికి విద్యే మార్గం

ABN, First Publish Date - 2021-03-01T06:44:26+05:30

మనో వికాసానికి విద్యే మార్గం

అధ్యాపకులను సన్మానిస్తున్న రావి వెంకట్రావ్‌, నల్లూరి వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్రాజపురం,  ఫిబ్రవరి 28 : మనిషి మానసిక దృఢత్వానికి, మనో వికా సానికి విద్యే మార్గమని, బాగా చదువ ుకుంటే జీవితంలో ముందుకు వెళ్లడానికి వీలవుతుందని దీంతో కుటుంబం, సమా జం బాగుంటుందని ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చైర్మన్‌ రావి వెంకట్రావ్‌ అన్నారు. కమ్మ విద్యార్థి సహాయ సంఘం ఆధ్వర్యంలో మొగల్రాజపురంలో నిర్వహి స్తున్న బాలుర, బాలికల హాస్టల్‌ వార్షికో త్సవం సందర్భంగా ఆదివారం విద్యా ర్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయని వాటిని ఎలా పరిష్కరించుకోవాలో, ఉపాధి అవకాశాలను ఎలా కల్పించుకోవాలో విద్య వల్లే తెలుస్తుందన్నారు.  కమ్మ విద్యార్థి సహాయ సంఘం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాతలు చేసిన సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ఉపాధ్యక్షులు మలినేని రాజయ్య, కార్యదర్శి పర్వతనేని ప్రభాస్‌ మాట్లాడుతూ  జీవితంలో అను కున్న లక్ష్యాలను సాధించడానికి అంతే పట్టుదలగా ప్రణాళికలు రూపొందించుకుని సఫలం చేసుకోవ డానికి నిజాయతీగా కృషి చేయాలన్నారు. అనతరం హాస్టల్‌లో చదువుతున్న 110 మంది విద్యార్థులకు గోల్డ్‌ సిల్వర్‌ మెడల్స్‌తో పాటు రూ. 5 లక్షలను ఉపకార వేతనాలుగా అందించారు. నగరంలో వివిధ కళాశాలల్లో పనిచేస్తూ డాక్టరేట్‌ పొందిన పది మంది అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి చనుమోలు కృష్ణారావు సభ్యులు మైనేని సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising