ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పంట నమోదుపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2021-07-24T06:43:22+05:30

ఈ పంట నమోదుపై అవగాహన అవసరం

అధికారులతో మాట్లాడుతున్న జేసీ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత

కంకిపాడు, జూలై 23 : ప్రతి రైతు తమ పంటను  ఈ నమోదు చేయించుకునే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత అన్నారు. మండలంలోని ఉప్పలూరు, పునాదిపాడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి ఈ పంట నమోదు  సరళీకృతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైతు తమ పంటను తప్పని సరిగా ఈ పంట నమోదు చేయించుకునే విధంగా  రెవెన్యూ,  వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ టి.వి.సతీష్‌, ఎంపీడీవో కొడాలి అనురాధ, ఏవో  కిరణ్‌, ఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఎరువుల ధర పట్టిక పోస్టర్‌ ఆవిష్కరణ

పెనమలూరు : ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్న ఎరువులు, ప్రైవేటు షాపుల్లో విక్రయిస్తున్న ఎరువుల ధరల పట్టికను పోస్టర్‌ రూపంలో ముద్రించి వ్యవసాయ శాఖ అధికారులు ఆవిష్కరించారు. శుక్రవారం పోరంకిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సునీల్‌ ధరల పట్టికను ఆవిష్కరించారు. సమావేశంలో కమిటీ చైర్‌ పర్సన్‌ గుంటూరు శ్రీనివాస చౌదరి, సభ్యులు కొడాలి శ్రీధర్‌, కం బాల ఆదిశేషు, పోలవరపు రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising