ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగుతో ముప్పు!

ABN, First Publish Date - 2021-05-08T06:05:04+05:30

మురుగుతో ముప్పు!

కామినేని నగర్‌ కాలనీ సమీపంలో పేరుకుపోయిన వ్యర్థాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఫవెదజల్లుతున్న దుర్వాసన

ఫవిజృంభిస్తున్న దోమలు

ఫ వ్యాధులబారిన కాలనీ వాసులు

 భారతీనగర్‌, మే 7 : కనకదుర్గానగర్‌, కామినేని నగర్‌ ప్రాంతాల్లోని పంటకాలువలో మురుగు ప్రవహించక పోవడంతో దుర్వాసనతో పాటు విజృంభిస్తున్న దోమలతో ఈ ప్రాంతవాసులు ఇబ్బందిపడుతున్నారు.  ఈ రెండు కాలనీ లకు ఒక పక్క పంటకాలువ మరోవైపు గుంటతిప్ప డ్రెయిన్లు ఉన్నాయి. ఇవి రెండు మురుగునీటి కాలువలు. వీటిలో పంట కాలువ పడమట ప్రాంతంలో ప్రారంభమై గురునానక్‌ కాలనీ మీదుగా శ్రీనివాసనగర్‌ బ్యాంక్‌ కాలనీ, శ్రీరామ చంద్రనగర్‌ కాలనీ, కరెన్సీ నగర్‌  ప్రాంతాల్లోని  వాడకం నీరు మొత్తం ఈ కాలువలో కలుస్తుంది.  ఇదీ కనకదుర్గ నగర్‌ కాలనీ సమీపంలోని గుంటతిప్ప డ్రెయిన్‌లో కలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు మురుగునీటి కాలువల్లో వీఎంసీ సిబ్బంది పూడిక పనులు చేపట్టకపోవటంతో  పలు చోట్ల చెత్త ఇతర వ్యర్థాలతో పేరుకు పోయింది. దీంతో  రోజుల తరబడి మురుగు ప్రవహించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. వేసవిలో సైతం డ్రెయిన్లు అనేక ప్రాంతాల్లో పొంగు తున్నాయి. వర్షాకాలం రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. పూడిక పనులు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు అనేక సార్లు వీఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించటం లేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దోమలు రాత్రి పగలు అనే తేడా లేకుండా విజృంభిస్తున్నా యని పగలు ఇళ్లలో చేరుతున్నాయని వాపోతున్నారు.  దోమకాటుతో తరచూ వ్యాధులబారిన పడుతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాలు పడకు ముందే డ్రెయిన్లలో పూడిక పనులు చేపట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-05-08T06:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising