ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ యాప్‌తో మహిళలకు భద్రత

ABN, First Publish Date - 2021-07-31T05:58:22+05:30

దిశ యాప్‌ ద్వారా మహిళల భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి కొడాలి నాని

గుడివాడ, జూలై 30: దిశ యాప్‌ ద్వారా మహిళల భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు. బంటుమిల్లి రోడ్డులోని అలంకృత ఫంక్షన్‌ హాలులో శుక్రవారం దిశ యాప్‌పై ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ యాప్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల్లో దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ సిదార్థకౌశల్‌ మాట్లాడుతూ గుడివాడ డివిజన్‌లో 1.25 లక్షల మంది దిశ యాప్‌ను డోన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. మిగతా వారు కూడా  దిశ యాప్‌ను పోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. మహిళల పరిరక్షణకు పోలీసు యంత్రాగం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.   సమావేశంలో ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌, డీఎస్పీ ఎన్‌.సత్యానందం, ఐసీడీఎస్‌ సీడీపీవో సముద్రవేణి, న్యాయవాదులు సత్యవాణి, కాట్రగడ్డ రజని, సబ్‌ డివిజన్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-31T05:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising