విధ్వంసాలపై నోరు మెదపరేం : దేవినేని ఉమా
ABN, First Publish Date - 2021-01-09T06:05:16+05:30
విధ్వంసాలపై నోరు మెదపరేం : దేవినేని ఉమా
విద్యాధరపురం, జనవరి 8 : రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలపై ఫేక్ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 సంఘటనలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలపై సీఎం స్పందన ఎలా ఉంటుందోనని ఐదుకోట్ల మంది ప్రజలు ఎదురుచూశారని, మంత్రి బొత్స సత్యనారాయణతో చిలక పలుకులు పలికించారని విమర్శించారు. సీఎం పంచె కడితే పరమాత్ముడవలేరని, ఆయన అసమర్థ వైఖరి వల్ల ప్రభుత్వ వ్యవస్థలకు, యంత్రాంగానికి పక్షవాతం వచ్చిందన్నారు. జగన్ బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని ఇంతవరకు పట్టుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
Updated Date - 2021-01-09T06:05:16+05:30 IST