ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు

ABN, First Publish Date - 2021-04-21T06:19:28+05:30

మండలంలో రబీకి సంబంధించిన కోతలు దాదాపు పూర్తి కావటంతో అవ్వడంతో రైతులు దిగుబడి అయిన ధాన్యాన్ని కల్లాలో, ఇళ్లవద్ద అరబెట్టారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతుల్లో భయందోళనలు నెలకొంటున్నాయి.

కల్లంలో ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువూరు, ఏప్రిల్‌ 20 : మండలంలో రబీకి సంబంధించిన కోతలు దాదాపు పూర్తి కావటంతో అవ్వడంతో రైతులు దిగుబడి అయిన ధాన్యాన్ని కల్లాలో, ఇళ్లవద్ద అరబెట్టారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతుల్లో భయందోళనలు నెలకొంటున్నాయి. ఇటీవల కొద్దిపాటి వర్షం పడటంతో రైతులు తమధాన్యాన్ని రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. పట్టాలు అందుబాటులో ఉన్న వారు ధాన్యం రాసులపై పట్టలు కప్పగా, కొందరు అద్దెకు పట్టాలు తెచ్చుకొని పంటను కాపాడుకున్నారు. కొద్దిపాటి వర్షం అవ్వడంతో  ఊపిరిపీల్చుకున్న రైతులు, పెద్దవర్షం పడితే తమ పరిస్థితి ఏమిటంటున్నారు. మండలంలోని ఆర్‌బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ధాన్యం ఆయా  కేంద్రాలు తరలించేందుకు సిద్ధమవుతున్న  రైతులకు  కొన్ని సాంకేతికపరమైన సమస్యలు అడ్డుపడుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్‌బీకేలో ధాన్యం ధాన్యం విక్రయించాలంటే రైతులకు సంబంధించి సాగుభూమి, పట్టాదారు పాస్‌పుస్తకం, రైతుకు ఇతర వివరాలు  కేంద్రంలో నమోదు చేసిన తరువాత మరో అధికారి ధాన్యం తేమశాతం పరిశీలించిన అనంతరం ఏప్పుడు కేంద్రానికి ధాన్యం తరలించాలో చెబుతారు. ప్రస్తుతం ఆర్‌బీకేలో  రైతులకు సంబంధించిన ఎటువంటి వివరాలు నమోదు కావటం లేదు. ఖరీప్‌కు సంబంధించి ఏప్రిల్‌ 30 వరకు గడువు ఉండటంతో, రబీలో ధాన్యం కొనుగోలుకు ఆటంకం ఏర్పాడుతుందంటున్నారు. 


గడవు కోరుతున్న రైసుమిల్లు యజమానులు

కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తోలకాలకు సంబంధించి అధికారులు సూచించిన రైస్‌మిల్లుల యాజమానులు గత ఖరీప్‌లో దిగుమతి చేసుకున్న ధాన్యం తమ వద్దె ఉందంటున్నారు. రబీధాన్యం కొనుగోలు చేసేందుకు గడువు కొరుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఒక మిల్లుకు ధాన్యం తోలకాలకు అనుమతులు ఉన్న ఆ ఽమిల్లు యాజమాన్యం ధాన్యం సంచులు సరఫరా చేయకపోవటం మరో సమస్యగా మారింది. మండలంలోని వావిలాల, మల్లేల, మునుకుళ్ల, వామకుంట్ల తదితర గ్రామాల్లో దాదాపు 80 శాతం వరకు కోతలు పూర్తి అయ్యాయి. దిగుబడి ఆశజనకంగా ఉన్నప్పటికి ప్రభుత్వ కొనుగోళ్లకు సమస్యలు తలెత్తటంతో ప్రైవేటు వ్యాపారులకు వరంగా మారుతోంది. రైతుల ఆందోళనను గుర్తించిన వ్యాపారులు ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.  ఏఎంసీ ఈ గోడౌనులలో రౌతులు ధాన్యం నిల్వ చేసుకునే వెసులుబాటుతో పాటు, రైతుబంధు పథకంలో గోడౌన్‌లో ఉంచిన ధాన్యంలో 75 శాతం రుణం అందించేవారు. ఈ విధానం రైతులకు పూర్తి లాభదాయకంగా ఉండేది. ప్రస్తుతం తిరువూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో   2019-20 సంవత్సరానికి సంబంధించి సుమారు 100 మందికి పైగా రైతులు రైతుబంధు పథకంలో చెల్లించాల్సిన  సుమారు 99 లక్షలు నేటికి ఆర్థికపరమైన అనుమతులు లేక మంజూరు కాలేదని సమాచారం. రైతుబంధు పథకంతో నిమిత్తం లేకుండా గోడౌనులో ఖాళీని బట్టి రైతులు తమ ధాన్యం నిల్వ ఉంచుకునే అవకాశం ఉందని  మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సౌజన్య తెలిపారు. శాఖపరమైన ఆదేశాల ప్రకారం గోడౌను అద్దెచెల్లింపు ఉంటుందన్నారు.



Updated Date - 2021-04-21T06:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising