ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటేయలేదని కాలు విరగ్గొట్టారు!

ABN, First Publish Date - 2021-03-06T06:37:56+05:30

పంచాయతీ పోరులో తమ మద్దతుదారులకు ఓటు వేయలేదన్న అక్కసుతో రాష్ట్రంలో అనేకచోట్ల దాడులకు పా ల్పడిన వైసీపీ మూకలు.. తాజాగా పమిడిము క్కల మండలం వేల్పూరులో మరో అరాచకానికి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తటస్థ వ్యక్తిపై వైసీపీ మూకల దారుణం

పమిడిముక్కల : పంచాయతీ పోరులో తమ మద్దతుదారులకు ఓటు వేయలేదన్న అక్కసుతో రాష్ట్రంలో అనేకచోట్ల దాడులకు పా ల్పడిన వైసీపీ మూకలు.. తాజాగా పమిడిము క్కల మండలం వేల్పూరులో మరో అరాచకానికి తెగబడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు అభ్యర్థికి ఓటేయలేదని తిడుతూ ఏ పార్టీకీ చెందని ఓ తటస్థ వ్యక్తిపై వైసీపీకి చెం దిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కాలు విరి చేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు లోకొచ్చింది. వేల్పూరులో టీడీపీ మద్దతు అభ్య ర్థి రత్నం దిలీ్‌పకుమార్‌ సర్పంచిగా గెలుపొందారు. సర్పంచికి దూరపు బంధువైన రత్నం సురేష్‌ ఒంటరిగా నివసిస్తున్నాడు. ఎప్పటిలానే బుధవారం రాత్రి పంచాయతీ కార్యాలయ ఆవ రణలో నిద్రిస్తున్నాడు. వైసీపీకి చెందిన ఉంగరాల హరీష్‌, ఉంగరాల రామకృష్ణ, గుడివాడ రాజు... మాటలు కలిపి.. ఆపై రెచ్చగొట్టి.. తమ మద్దతుదారుడికి ఓటు ఎందుకు వేయలేదం టూ సురేష్‌ను దూషించి కింద పడేసి కొట్టి.. కాలు విరగ్గొట్టారు.. బాధితుడు, అతని సోదరి సాయంతో అతికష్టమ్మీద పమిడిముక్కల పోలీ సుస్టేషన్‌కు వెళ్లి గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి.. సురే్‌షను తొలుత ఉ య్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. సురేష్‌ కాలుకు పిండికట్టు కట్టించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-06T06:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising