ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవుకు అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-08-28T04:54:45+05:30

ఆవుకు అంత్యక్రియలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘంటసాల, ఆగస్టు 27 : మనిషి ప్రేమకు ఎల్లలుండవు. అది అయినవారి మీదైనా, పశువుల మీదైనా. ఎంతగా ప్రేమిస్తారో, దూరమైతే అంతగా విలవిల్లాడిపోతారు. రైతైతే తనను పోషిస్తున్న పశువులపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. తాను కంటికి రెప్పలా చూసుకుంటున్న గోవు మృతి చెందటంతో ఓ రైతు కుటుంబం విలవిల్లాడిపోయింది. ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన రైతు గుత్తికొండ వరప్రసాద్‌కు చెందిన మూడోతరం ఆవుకు నెలలు నిండి దూడకు జన్మనివ్వబోయే సందర్భంలో అనారోగ్యానికి గురైంది. ఆవును కాపాడుకోవడానికి గన్నవరంలో ఉన్న పశువైద్య కళాశాలకు తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించారు. అప్పటికే కడుపులో మృతిచెందిన దూడను బయటికి లాగి ఆవుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. అయితే, ఇంటికొచ్చిన మరుసటిరోజే ఆవు మరణించింది. దీంతో వరప్రసాద్‌ కుటుంబసభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. మృతిచెందిన ఆవుకు ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా తమ పొలంలో అంత్యక్రియలు చేశారు. గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. 

Updated Date - 2021-08-28T04:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising