ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-04-13T05:59:51+05:30

నగరపాలక సంస్థకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెట్టే గవర్నర్‌పేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ ఆదాయానికి గండిపెడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెల్లిబండ్ల బాలస్వామి డిమాండ్‌ చేశారు.

రీ సైక్లింగ్‌ అవుతున్న సెల్లార్‌ వాహనాల టికెట్లు చూపిస్తున్న బాలస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ను సందర్శించిన 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాలస్వామి

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 12: నగరపాలక సంస్థకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెట్టే గవర్నర్‌పేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ ఆదాయానికి గండిపెడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెల్లిబండ్ల బాలస్వామి డిమాండ్‌ చేశారు. స్థానిక వ్యాపారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం బాలస్వామి ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ను సందర్శించి జరుగుతున్న అవకతవకలను పరిశీలించారు. అనంతరం బాలస్వామి మాట్లాడుతూ సెల్లార్‌ పార్కింగ్‌ను కార్పొరేషన్‌ సిబ్బంది నిర్వహించడం వల్ల ఏటా లక్షలాది రూపాయలు ఆదాయాన్ని కార్పొరేషన్‌ కోల్పోతుందన్నారు. తోపుడుబళ్ల వాళ్లకు సెల్లార్‌ను అద్దెలకు ఇస్తున్నారని, పార్కింగ్‌ టిక్కెట్లు కూడా దొంగవి ముద్రించి, టోకెన్లు రీసైక్లింగ్‌ చేస్తూ కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా అద్దె చెల్లించకుండా, సీసీ కెమెరాల నిర్వహణ చేయకుండా సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. కాంప్లెక్స్‌లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానం తెస్తామని, కమిషనర్‌, మున్సిపల్‌ శాఖా మంత్రికి వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-04-13T05:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising