ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు అభివృద్ధి, పథకాలు గెలిపించాయి

ABN, First Publish Date - 2021-03-21T05:59:27+05:30

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి కారణమని 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. 23వ డివిజన్‌ నుంచి టీడీపీ కార్పొరేటర్‌గా ఎన్నికైన నెల్లిబండ్ల బాలస్వామి శనివారం డివిజన్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

సూర్యారావుపేటలో అట్టహాసంగా సాగిన బాలస్వామి విజయోత్సవ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రబాబు అభివృద్ధి, పథకాలు గెలిపించాయి 

విజయోత్సవ ర్యాలీలో 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాలస్వామి 

గవర్నర్‌పేట, మార్చి 20: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి కారణమని 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. 23వ డివిజన్‌ నుంచి టీడీపీ కార్పొరేటర్‌గా ఎన్నికైన నెల్లిబండ్ల బాలస్వామి శనివారం డివిజన్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, డివిజన్‌ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ అభివృద్ధికి డివిజన్‌ ప్రజలు పట్టం కట్టారన్నారు.  2014 నుంచి 2019 మధ్య కాలంలో డివిజన్‌లో అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నానికి ధన్యవాదాలు తెలిపారు. సూర్యారావుపేట విష్ణువర్థనరావు వీధిలోని 23వ డివిజన్‌ టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ సూర్యారావుపేట,సీతారామపురం, గవర్నర్‌పేట ప్రాంతాల్లో సాగింది. అలంకరించిన జీప్‌పై నుంచి బాలస్వామి ప్రజలకు అభివాదం చేస్తూ తనను రెండో సారి గెలిపించిన డివిజన్‌ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీ సాగిన ప్రాంతంలో ప్రజలు బాలస్వామిపై పూలవర్షం కురిపిస్తూ అభివాదం చేశారు. ర్యాలీలో డివిజన్‌ నేతలు చింతా దుర్గారావు, వసంత, చంటి, రత్న, సూర్య, మల్లి, అప్పారావు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-21T05:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising