ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాకింగ్ చేసి విపక్షాలపై విమర్శలు చేస్తారా?: Sailajanath

ABN, First Publish Date - 2021-07-21T18:26:27+05:30

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని ఏపీపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. దేశ రక్షణకు తిలోదకాలు ఇవ్వాలని బీజేపీ నేతలు చూస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ కొరతతో, కరోనాతో, ప్రాణాలు పోలేదని అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పెద్దలు ఫెగాసిస్ ద్వారా ఫోన్ హ్యాకింగ్  చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వం కుప్పకూలడానికి ఫెగాసిస్ హ్యాకింగ్ కారణమన్నారు. ప్రజాస్వామిక వాదులు, హక్కుల కోసం పోరాడే వారిపై హ్యాకింగ్ అమలు చేస్తూ, నిఘా పెడుతున్నారన్నారు.  ఫెగాసిస్ నిర్వాహకులే ప్రభుత్వాలతో డీల్ చేస్తామని చెప్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఫెగాసిస్ దేశంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫెగాసిస్ హ్యాకింగ్‌పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. హ్యాకింగ్ చేసి విపక్షాలపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ఫెగాసిస్ హ్యాకింగ్‌కు వ్యతిరేకంగా రేపు నిరసనలు చేపట్టబోతున్నామని శైలజానాథ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-21T18:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising